
జగదీశ్వర్‌రెడ్డి ఆదర్శప్రాయుడు
● నేటి విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి
● ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో ఈనెల 5న నిర్వహించే గణనాథుడి నిమజ్జనం శోభాయాత్ర కోసం పోలీస్‌శాఖ భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మంది పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ డి.జానకితో పాటు అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్ కలిపి 50, 120 మంది కానిస్టేబుల్స్, 20 మంది స్పెషల్ పార్టీ, 30 మంది హోంగార్డులను బందోబస్తు కోసం ఉపయోగించనున్నారు. ప్రతి విగ్రహాం దగ్గర ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయగా మజీద్, ఆలయాల దగ్గర పికెట్ నిర్వహించారు. ప్రతి విగ్రహానికి జియోట్యాగ్ చేసిన పోలీసులు రూట్ మ్యాప్ ప్రకారం తరలించనున్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యతలను పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగా భారీగా పోలీసులను మెహరించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రను ఎప్పటికప్పుడు డేగకళ్లతో పరిశీలించడం, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు నిశితంగా పర్యవేక్షించనున్నారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్, నిఘా కెమెరాల ద్వారా సమీక్షించనున్నారు. మహబూబ్‌నగర్‌లో గణనాథుల శోభయాత్ర సందర్భంగా ప్రధానంగా నగరంలో క్లాక్‌టవర్, అంబేద్కర్ చౌరస్తా, పాతపాలమూరు. పాన్ చౌరస్తాలలో ఊరేగింపు దగ్గర ప్రత్యేక బందోబస్తు కేటాయించనున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ మొదటి దశ పోరాటంలో కేంద్ర మాజీ మంత్రి పి.మల్లికార్జున్‌తో కలసి దివంగత మాజీ ఎమ్మెల్సీ ఎస్.జగదీశ్వర్‌రెడ్డి పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి వచ్చేందుకు ఎంతో సహకరించారన్నారు. పాజిటివ్ దృక్ఫథం కలిగిన ఆయన సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని వర్గాలను కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. అప్పట్లో మాకు మార్గదర్శకంగా ఉన్నారని, విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. గురువారం పద్మావతీకాలనీలోని గ్రీన్‌బెల్ట్‌లో జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం పద్మావతీకాలనీలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, హర్షవర్ధన్‌రెడ్డి, సీజే బెన్‌హర్ పాల్గొన్నారు.