
మహబూబ్‌నగర్ వద్దు.. వికారాబాద్‌లో కలపండి
● ఉమ్మడి మండలాల జేఏసీ కార్యవర్గ సమావేశం
● వికారాబాద్‌లో కలపాలంటూ 80 శాతం యువకులు, నాయకుల తీర్మానం
మహమ్మదాబాద్/గండేడ్: గండేడ్, మహమ్మదాబాద్ మండలాలను మహబూబ్‌నగర్‌లో కలపడంతో రాజకీయం, అధికారికంగా ఎన్నో అవస్థలు పడుతున్నట్లు రెండు మండలాల జేఏసీ నాయకులు, యువకులు, విద్యావంతులు పేర్కొంటున్నారు. రెండు మండలాలను వికారాబాద్‌లో కలపాలని ఆదివారం మండల పరిధిలోని నంచర్ల గేట్ వద్ద రెండు మండలాల విలీన సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 80 శాతం మంది వికారాబాద్ జిల్లాలో కలపాలని, 15 శాతం మంది జిల్లా, అసెంబ్లీ, పార్లమెంటు ఒకే వైపు ఉండాలని, 5 శాతం మంది మహబూబ్‌నగర్ ఉంటేనే బాగుంటుందని తీర్మానించారు. దీంతో రెండు మండలాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు అన్ని గ్రామాల ప్రజల నిర్ణయాన్ని పరిణలోకి తీసుకొని ఉద్యమం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో సీఎంను కలిసి సమస్యను వివరించన్నున్నట్లు పేర్కొన్నారు.
జేఏసీ కార్యవర్గ సమావేశం
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మండల జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మదాబాద్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేందుకు మండల వాసులంతా మొగ్గుచూపుతున్నారన్నారు. దగ్గర్లోని జిల్లాను విడిచి రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మండలాన్ని మళ్లీ వికారాబాద్‌కు తరలించాలని పన్నాగం పన్నుతున్నట్లు మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు జితేందర్‌రెడ్డి, కేఎం నారాయణ, న్యాయవాది రాములు, కొమిరె లక్ష్మయ్య, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏవీ రాములు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.