
యువకుడి ఆత్మహత్యాయత్నం
గండేడ్: విద్యుత్ సరఫరాను సకాలంలో పునరుద్ధరించలేదంటూ ఓ వ్యక్తి సబ్‌స్టేషన్ ఎదుట గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పల్లె సోమభూపాల్‌రెడ్డి వ్యవసాయంతో పాటు గ్రామంలో నీటిశుద్ధి కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రూ.24 వేల విద్యుత్ బిల్లు బకాయి ఉండటంతో చెల్లించాలంటూ గురువారం లైన్‌మేన్ మన్నాజీ ఫోన్ చేశారు. మహబూబ్‌నగర్‌లో ఉన్నానని శుక్రవారం చెల్లిస్తానని తెలుపగా వినకుండా సిబ్బందితో కనెక్షన్ తొలగించారు. దీంతో చేసేది లేక శుక్రవారం 10.30 ప్రాంతంలో సల్కర్‌పేట్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి బిల్లు చెల్లించి కనెక్షన్ పునరుద్ధరించాలని కోరారు. అందుకు లైన్‌మేన్ నిరాకరించి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని చెప్పారు. దీంతో మరోమారు సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఏఈ శ్రీకాంత్‌ను కలిసి తన సమస్యను వివరించారు. ఏఈ లైన్‌మెన్‌ను పిలిచి మాట్లాడినా కలెక్షన్‌లో ఉన్నాం.. రెండు గంటలకు ఇస్తామని బదులివ్వడంతో తనను వేధిస్తున్నారంటూ సోమభూపాల్‌రెడ్డి బైక్‌లో తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును వారి ఎదుట తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న ఆపరేటర్ హరినాయక్ అడ్డుకోవడంతో డబ్బా కిందపడింది. వెంటనే దాన్ని తిరిగి తీసుకొని రోడ్డు మీదకు పరిగెత్తి తాగేశాడు. గుర్తించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఏఈ శ్రీకాంత్‌ని వివరణ కోరగా విచారణ చేసి లైన్‌మేన్ నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.