
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జడ్చర్ల: రెండు రోజుల కిందట చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటకు చెందిన భాను(24) మిత్రులతో కలిసి ఈ నెల 14న జడ్చర్ల వంద పడకల ఆసుపత్రి సమీపంలో ఎగువ నుంచి వస్తున్న వరదలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు శనివారం సమీప ముళ్ల పొదల్లో యువకుడి మృతదేహం ఉండడాన్ని ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం