
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
గట్టు: మరో గంటన్నర ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు. తెల్లారక ముందే ఆ ఇద్దరు ప్రాణాలు సిమెంట్ (సిమెంట్ తయారి కోసం బూడిదను తీసుకెళ్లే లారీ) లారీ రూపంలో గాలిలో కలిశాయి. తెలంగాణ–కర్ణాటక సరిహద్దుల్లో రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్ద కారును సిమెంట్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాచర్లకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి పీజీ రాఘవేంద్ర(42)తో పాటుగా ఇదే గ్రామానికి చెందిన అల్లుడు తౌడు నాగన్న అలియాస్ నాగేష్(50)లు మాచర్లకు చెందిన చేనేత కార్మికుడు వస్త్రా వ్యాపారి పీజీ మాసుమన్న, పీజీ రాఘవేంద్ర తండ్రీకొడుకులు సొంతకారులో రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పూనేకు వస్త్రాల కొనుగోలు కోసం వెళ్లారు. శుక్రవారం వారు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మాచర్లకు చెందిన భార్యాభర్తలు ఈరమ్మ అలియాస్ జయంతి, ఆమె భర్త నాగన్న, అలియాస్ నాగేష్‌లను కారులో మాచర్లకు రావడానికి ఎక్కించుకున్నారు. వారి ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గం దాటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ కారును ఢీ కొట్టింది. డ్రైవింగ్ సీటులో ఉన్న రాఘవేంద్ర (42)తో పాటు పక్క సీటులో కూర్చున్న మాచర్ల అల్లుడు నాగేష్(50)అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుక సీటులో కూర్చున్న తండ్రి పీజీ మాసుమన్న, జయంతి గాయాలతో బయట పడ్డారు. జయంతికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రస్తుతం ఆమె రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కర్ణాటకలోని సైదాపూర్ ఎస్‌ఐ వినయ్‌బడిగేర కేసు నమోదు చేసి మృతదేహాలను రాయచూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాఘవేంద్రకు భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన నాగన్నకు ఇద్దర కుమారులు ఉన్నారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
భర్త మరణం భార్యకు తెలియకుండా..
లారీ రూపంలో మృత్యువు కబళించగా, కర్ణాటకలోని సైదాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జయంతి భర్త నాగేష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం జయంతికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. కాళ్లు, చేతులు విరిగి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం అనంతరం రాఘవేంద్ర మృతదేహాన్ని మాచర్లకు, నాగేష్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలించారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సైదాపూర్ వద్ద కారును ఢీకొట్టిన లారీ
కర్ణాటక సరిహద్దులో ప్రమాదం
మాచర్లలో విషాదఛాయలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం