
ఇంట్లో తయారీ.. పట్టణాల్లో విక్రయం
పాలకోవాను ఇంట్లోనే సిద్ధం చేస్తారు. ఉదయం పాలసేకరణ అనంతరం కట్టెలపొయ్యిపైనే పాలకోవను తయారు చేస్తారు. ఆ తర్వాత కర్నూల్, అయిజ, శాంతినగర్, అలంపూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తారు. మిఠాయి, ఇతర దుకాణాలకు సైతం పాలకోవాను సరఫరా చేస్తున్నారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకోవాను విక్రయిస్తారు. ఇళ్లు అలంపూర్– రాయచూరు రోడ్డుమార్గంలో ఉండడంతో ఈ మార్గాన ప్రయాణించేవారు కొనుగోళు చేస్తారు. పట్టణాల్లో సైతం వీళ్లు తయారు చేసే పాలకోవాను నిరంతరం కోనుగోళు చేసే వినియోగదారులు, ఉద్యోగులు ఉన్నారు.