
డీసీఎం బోల్తా.. తప్పిన ప్రమాదం
కొత్తకోట రూరల్: ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కొత్తకోట మండలం పాలెం సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం నుంచి హైదరాబాద్‌కు ఇనుము లోడ్ తీసుకెళ్తున్న వాహనం శనివారం తెల్లవారుజామున పాలెం బ్రిడ్జి సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ యాదగిరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, హైవే సిబ్బంది వచ్చి వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆనంద్ తెలిపారు.