
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పర్యటించారు. జడ్చర్ల, భూత్పూర్ మండలం శేరిపల్లి, వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించి.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. పోల్కంపల్లి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను రెస్క్యూ బృందం రక్షించే చర్యలను పర్యవేక్షించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పోల్కంపల్లి, శేరిపల్లిలో పర్యటించగా.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న అమరరాజా కంపెనీ సిబ్బందిని పరామర్శించారు. శేరిపల్లి వద్ద వరద నీరు మళ్లింపు ఏర్పాట్లను ఎస్పీ జానకితో కలిసి ఐజీ చౌహాన్ పరిశీలించారు.