దేశాభివృద్ధికి సమష్టిగా కృషి | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

Aug 15 2025 8:23 AM | Updated on Aug 15 2025 8:23 AM

దేశాభ

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

ఆగని అవినీతి..
మహబూబ్‌నగర్‌
కోయిల్‌సాగర్‌ 5 గేట్లు ఎత్తివేత
తెగిన కల్వర్టు.. పడిన బస్సు

సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలి

కులం, మతం, భాష, ప్రాంత భేదాభిప్రాయాలు ఉండొద్దు

జిల్లాకేంద్రంలోని వాసవీ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ టాక్‌షో

అభిప్రాయాలు వెలిబుచ్చిన విద్యార్థులు

పొంగిన వాగులు.. నిండిన చెరువులు, కుంటలు

జడ్చర్ల వద్ద ఎన్‌హెచ్‌ సర్వీస్‌ రోడ్డుపై పోటెత్తిన వరద

చిక్కుకున్న 2 బస్సులు.. ప్రయాణికులు సురక్షితం

భూత్పూర్‌లోని శేరిపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు..

దెబ్బతిన్న రహదారులు.. జలదిగ్బంధంలో ఆర్‌యూబీలు

పలు చోట్ల నీటమునిగిన కాలనీలు.. రాకపోకలకు అంతరాయం

వివిధ ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ

‘స్వతంత్ర భారతదేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోనూ అవే రాజ్యమేలుతున్నాయి. స్వేచ్ఛ.. సమానత్వం అనేవి మాటలకే పరిమితమయ్యాయి. విద్య, వైద్యం అంటే కాసులు కుమ్మరించాల్సిందే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలి. ఈ మేరకు చట్టసభలతో పాటు అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తూ స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాలి.’ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 78 ఏళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం 79వ వసంతంలోకి అడుగిడుతున్న స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్ర ఫలాలు అందుతున్నాయా? వంటి పలు అంశాలపై ‘సాక్షి’ గురువారం సర్వే చేపట్టింది. పలు వర్గాల ప్రజలు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025

రిజర్వేషన్లుఉండవద్దు..

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో ఇంకా సమానత్వం అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. నిజమైన సమానత్వం రావాలంటే కులం, మతం పేరిట ఉన్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– అశ్విని, రెండో సంవత్సరం

సర్వే సాగిందిలా..

మ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 150 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి 30 మంది (పురుషులు 15, మహిళలు 15) చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఎంచుకున్న మూడు ప్రశ్నలకు ఒక్కొక్కరి నుంచి సమాధానాలను రాబట్టింది. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వ్యవస్థలోని కాలానుగుణ మార్పులు, లోపాలతో పాటు ఇంకా మెరుగు కావాల్సిన అంశాలను ప్రస్తావించారు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పరంగా పూర్తిస్థాయిలో మార్పులు చోటు చేసుకున్నప్పటికి మరింత మార్పు రావాలని, కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేకుండా సమష్టిగా దేశాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాసవి డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన టాక్‌ షోలో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి?

పర్యావరణ సమతుల్యత..

దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నా.. స్థిరమైన అభివృద్ధి సాధించలేకపోయాం. ఇష్టానుసారంగా ప్లాస్టిక్‌ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. భవిష్యత్‌లో పెద్దఎత్తున చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి.

– అనూష, మొదటి సంవత్సరం

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో..

దేశంలో ప్రతిభ ఉన్న వారు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడ రాణిస్తుండటంతో మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే మంచి ఉద్యోగాలు సృష్టించి.. దేశాభివృద్ధికి దోహదపడాలి.

– హిమబిందు, మొదటి సంవత్సరం

ఉచితాలు ఇవ్వకూడదు..

ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల పేరుతో ఇచ్చే వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా సామాజిక స్పృహ కలిగి ఉండి, ఓటింగ్‌ సమయంలో కేవలం డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా ఉండే వారికి మాత్రమే ఓటు వేయాలి.

– శ్రవంతి, రెండో సంవత్సరం

విద్యార్థుల భవిష్యత్‌..

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవన్నీ ప్రజలను మభ్యపెట్టేలా ఉంటున్నాయి. కాబట్టి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ బాగుండాలంటే తప్పకుండా కొత్త పథకాలు తీసుకువచ్చి మెరుగ్గా చదువుకునేలా కృషిచేయాలి. – లక్ష్మీ, రెండో సంవత్సరం

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు ఏవి ?

స్వేచ్ఛ– సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా?

చట్ట సభలు

న్యాయ స్థానాలు

అధికార యంత్రాంగం

మీడియా

వసతులుకల్పించాలి..

ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా అనుకున్న స్థాయిలో వసతులు మాత్రం లేవు. పేదరికంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, ఇన్యూరెన్సు సౌకర్యం కలిస్తే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

– మహ్మద్‌ అఫ్రోజ్‌, మొదటి సంవత్సరం

అదే భారత్‌ గొప్పతనం

దేశంలో అనేక మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పడమే భారత్‌ గొప్పతనం. అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకుంటూ జీవిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో దేశం మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలి. – అబ్దుల్లా, మొదటి సంవత్సరం

అవును

లేదు

కొద్దిగా..

అంతరాలు తొలగించాలి..

సుపరిపాలన అందించే దిశగా ప్రధానంగా చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు తొలగేలా ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకుసాగాలని.. వ్యవస్థలను నిర్వీర్యం చేసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం గానీ, వారి ప్రభావం గానీ లేకుంటే అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందని.. అప్పుడు న్యాయస్థానాలు, మీడియా అవసరం ఉండదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

శేరిపల్లి వద్ద హైవే–44పైభారీగా వరద..

దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో శేరిపల్లి వద్ద కోమటికుంట చెరువు నిండి వరద నీరు జాతీయ రహదారి–44పైకి పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట మండలంలోని పోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, మేకలు, కాపరులు చిక్కుకుపోయారు. మూగజీవాలతో పాటు కాపరులను రెస్క్యూ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. దేవరకద్ర మండలంలో జీనుగురాల, దేవరకద్ర పట్టణం మధ్య ఉన్న లింక్‌ రోడ్‌ వరద ఉధృతితో తెగిపోయింది. డోకూర్‌లో నిర్మిస్తున్న ఆర్‌యూబీలో వరద నీరు నిలిచి రాకపోకలు బంద్‌ అయ్యాయి. చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతల గ్రామ గొలుసుకట్టు చెరువు కాల్వకు గండి పడింది. అడ్డాకుల మండలం పెద్దవాగు వరద ఉప్పొంగడంతో గౌరీదేవిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. పొంగిన వాగులు, అలుగు పారుతున్న చెరువులు, కుంటలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తుండడం, రోడ్లు దెబ్బతినడం.. రైల్వే అండర్‌ బ్రిడ్జిలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వివిధ గ్రామాలు, కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో కలెక్టర్‌ విజయేందిర బోయి, ఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ జానకి పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/మహబూబ్‌నగర్‌ వ్యవసాయం

అలుగుపారిన 599 చెరువులు.. రైతుల్లో హర్షం

భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 823 ఉండగా.. ఇందులో 599 అలుగు పారుతున్నాయి. 25 శాతం నిండినవి 44.. 50 శాతం నిండినవి 72.. 75 శాతం నిండినవి 69.. 100 శాతం నిండినవి 39 చెరువులు కాగా.. వాటికింద ఆయకట్టులోని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలు ప్రస్తుతం పంటలకు ఊపిరిపోసినట్లయిందని.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందని ద్రాక్షగానే స్వేచ్ఛ.. సమానత్వం చట్టసభలు, అధికారుల్లో మార్పు రావాలి

మరింత నీతి, నిజాయితీగా పనిచేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిమతం

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి1
1/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి2
2/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి3
3/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి4
4/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి5
5/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి6
6/6

దేశాభివృద్ధికి సమష్టిగా కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement