
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానం 79వ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. శుక్రవా రం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణ కోసం అర్బన్ తహసీల్దార్ కార్యాలయ అధికారులతోపాటు ఎస్పీ కార్యాలయ ఏఆర్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్, జెడ్పీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేడుకలలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాత్తు సాధన చేశారు. కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయం ఇతర ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేశారు.
కార్యక్రమాలు ఇలా..
● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ జానకి పరేడ్ మైదానానికి చేరుకుంటారు ● ఉదయం 9.25 గంటలకు కలెక్టర్ విజయేందిర రాక ● ఉదయం 9.29 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు రాక ● ఉదయం 9.30 గంటలకు మంత్రిచే పతాకవిష్కరణ, వందన స్వీకారం ● ఉదయం 9.32 గంటలకు పోలీస్ కవాతు ● ఉదయం 9.45 నుంచి 10.15 గంటల వరకు మంత్రి సందేశం ● 10. 15 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం ● 10.20 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ● 10.50 నుంచి 11.20 వరకు శకటాల ప్రదర్శన ● 11.20 నుంచి 11.40 గంటల వరకు ప్రశంసాపత్రాల పంపిణీ ● 11.40 నుంచి 11.50 గంటల వరకు స్టాళ్ల సందర్శన ● మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ముగింపు
విద్యుత్ కాంతులతో కలెక్టరేట్