నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు
స్టేషన్ మహబూబ్‌నగర్: కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్నంలో బుధవారం నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ బాలికల నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు నలుగురు జిల్లా క్రీడాకారిణులు ఎంపికయ్యారు. బి.వర్ష, లాస్యప్రియ, హాస్య ప్రియ, సుదీక్షలు రాష్ట్ర బాలికల జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిని మంగళవారం జిల్లాకేంద్రంలో మహబూబ్‌నగర్ హైస్కూల్ కరస్పాండెంట్ రాజేందర్, ప్రిన్సిపల్ శాంత, రజనికాంత్‌రెడ్డి, జియావుద్దీన్, అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.


