
రోడ్లపైనే అమ్ముతున్నాం..
మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపై కూర్చొని చేపలు అమ్ముకుంటున్నాం. వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండల కేంద్రాలతోపాటు జిల్లాకేంద్రంలో చేపల మార్కెట్లు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలి. చేపల వృత్తిపై ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలి. – జనార్దన్, మత్స్యకారుడు,
కొనగట్టుపల్లి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం
అవగాహన కల్పించాలి..
మత్స్యకారులు గ్రామాల్లోని చెరువుల్లో పెంచే చేపలను విక్రయించుకునేలా జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోనూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. మార్కెటింగ్ సౌకర్యం లేక దళారుల బారినపడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించి మార్కెట్లు స్వయంగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాస్, మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు
●

రోడ్లపైనే అమ్ముతున్నాం..