పోటెత్తిన ఉల్లి
మార్కెట్‌కు
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో సీజన్ కావడంతో బుధవారం పెద్ద ఎత్తున ఉల్లి విక్రయాలు జరిగాయి. మార్కెట్‌లో ఉదయం పది గంటలకు ఉల్లి వేలం ప్రారంభమై మధ్యాహ్నం వరకు సాగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు ఉల్లి విక్రయించేందుకు పోటీపడ్డారు. ఉల్లి నిల్వ సామర్థ్యం అధికంగా ఉండటంతో వినియోగదారులు మార్కెట్‌కు పెద్దఎత్తున తరలించారు. మార్కెట్ బయట కూడా రైతులు ఉల్లి విక్రయాలు జరిపారు.
బస్తా ధర రూ.800
మార్కెట్‌లో ఉల్లి బహిరంగ వేలంలో గరిష్టంగా రూ.1,600, కనిష్టంగా రూ.1,000 వరకు ధర పలికింది. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.500కు విక్రయించారు. మార్కెట్‌కు దాదాపు మూడు వేల బస్తాల ఉల్లి విక్రయానికి రాగా, మార్కెట్ బయట మరో రెండు వేల బస్తాలు అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ. 2209...
బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,700గా నమోదైంది. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,913, కనిష్టంగా రూ.1,622, అముదాలకు గరిష్టంగా రూ.6000 ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.


