పైపులైన్ లీకేజీలువెంటనే సరిచేయండి
● నల్లా బిల్లుల వసూళ్ల శాతం పెరగాలి
● మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడైనా పైపులైన్‌లో లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో తాగునీటిని సరఫరా చేసే లైన్‌మెన్లు, ఫిట్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యే సమయంలో మున్సిపల్ పవర్ బోర్లు వినియోగించవద్దన్నారు. దీనివల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. మొత్తం 49 డివిజన్ల పరిధిలో సుమారు 750 పవర్ బోర్లును ఏర్పాటు చేశామన్నారు. వీటిని అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. అలాగే నల్లా బిల్లులు కేవలం 13 శాతమే వసూలైందని, బకాయిలను ఎక్కువగా రాబట్టాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎంఈ సందీప్ వరల్డ్ తదితరులు పాల్గొన్నారు.


