కనులపండువగా పూల రథోత్సవం
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంగళవారం తెల్లవారుజామునా పూల రఽథోత్సవం(చిన్నతేరు) కనులపండువగా సాగింది. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ అంజనేయులు, మేనేజర్ నిరంజన్ అర్చకులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిథులు, భక్తులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై దత్తాత్రేయ గుడి, ముక్కిండి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామస్మరణతో రథం ముందుకు సాగింది. రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలైన్‌ద్వార స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు మురళిధర్ శర్మ, లక్ష్మణ్ శర్మ,వేణు శర్మ, ఆనంద్ శర్మ, గోపి శర్మ, భాస్కర్ శర్మ, ప్రవీణ్ శర్మ భక్తులు పాల్గొన్నారు.
నేటి రాత్రి పెద్ద రథోత్సవం
బుధవారం అర్ధరాత్రి దాటాక పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఆలయ ఈఓ ఆంజనేయులు తెలిపారు.
అర్చకుల ప్రత్యేక పూజలు
పోటెత్తిన భక్తులు
కనులపండువగా పూల రథోత్సవం


