విత్తనాల పండుగలో జడ్చర్ల విద్యార్థులు
జడ్చర్ల టౌన్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఎర్త్ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ విత్తనాల పండుగలో జడ్చర్ల డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 వలంటీర్లు రవీందర్, భరత్ పాల్గొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డా.సదాశివయ్య ఆధ్వర్యంలో 530 రకాల విత్తనాలను ప్రదర్శించారు. మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగలో దేశ నలమూలల నుంచి రైతులు, రైతు సంఘాలు, ఇతర సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ప్రభుత్వరంగం నుంచి ఒక జడ్చర్ల డిగ్రీ కళాశాల మాత్రమే పాల్గొనట్లు సదాశివయ్య తెలిపారు. అందరూ పంట మొక్కల విత్తనాలు ప్రదర్శిస్తే.. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గత మూడేళ్ల నుంచి అనేక అటవీ ప్రాంతాల్లో సేకరించిన 530 రకాల విత్తనాలను ప్రదర్శించగా.. సినీ నటుడు నాగినీడు, నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అభినందించారు.
డబ్ల్యూఈపీఎల్‌లో సత్తాచాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా క్రికెట్ క్రీడాకారుడు గణేష్ ఇంగ్లాండ్‌లో జరిగే డబ్ల్యూఈపీఎల్ లీగ్‌లో పాల్గొంటుండడం సంతోషంగా ఉందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అ న్నారు. గణేష్‌ను ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు లోని ఎండీసీఏ మైదానంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఈపీఎల్) ప్రీమ్ 2 డివిజన్, వరిష్ట చెల్టినహమ్ ప్రీమియర్ టీ–20, డబ్ల్యూఈపీఎల్ టీ–20, నేషనల్, కంట్రీకప్ టోర్నమెంట్‌ల్లో ఆరునెలలపాటు గణేష్ ఆడనున్నాడని పేర్కొన్నారు. భవిష్యత్‌లో రంజీ జట్టుకు ఎంపికకావాలని ఆయన ఆకాంక్షించారు. ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సభ్యులు చంద్రకుమార్‌గౌడ్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ముఖ్తార్‌అలీ పాల్గొన్నారు.
విత్తనాల పండుగలో జడ్చర్ల విద్యార్థులు
విత్తనాల పండుగలో జడ్చర్ల విద్యార్థులు


