నిర్విరామంగా ‘టీబీఎం’ భాగాల తొలగింపు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం లోపల చిక్కుకున్న ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా.. పనులకు అడ్డంకిగా మారిన టీబీఎం భాగాల తొలగింపు ప్రక్రియ మంగళవారం మరింత వేగవంతం చేశారు. 39 రోజులుగా సొరంగం లోపల మట్టి, బురద, శిథిలాలను తొలగించేందుకు బృందాలు శ్రమిస్తున్నాయి. డీ1 నుంచి డీ2 మధ్యలో ఇటాచీల సాయంతో తీసిన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపడంతోపాటు, వెంటిలేషన్‌తో పాటు కన్వేయర్ బెల్టును వంద మీటర్ల ముందు వరకు పొడిగించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ, ర్యాట్ హోల్ మైనర్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, కేరళ కాడవర్ డాగ్స్,రోబోటిక్ వంటి 12 రకాల బృందాలకు చెందిన 600 మంది సహాయక సిబ్బంది పాల్గొంటున్నారు. సొరంగం లోపల ఎస్కవేటర్ల సహాయంతో మట్టిని బయటికి పంపిస్తూ నీటి ఊటను 150 హెచ్‌పీ మోటార్ల సహాయంతో డీవాటరింగ్ చేస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో
సహాయక చర్యలు ముమ్మరం
నిర్విరామంగా ‘టీబీఎం’ భాగాల తొలగింపు


