నవాబ్‌పేట: నాన్నంటే అభయమని.. అన్నింటా అండగా ఉండి నడిపిస్తాడని అంటున్నారు నవాబ్‌పేటకు చెందిన సుప్రియ, సుస్మిత, సందీప్. తమ అమ్మ చిన్ననాడే దూరమైనా నాన్నే.. అన్నీ తానై పెంచి పెద్ద చేశా డని చెబుతున్నారు. తండ్రి మహేశ్వర్‌జీ కష్టపడి తమ ను చదివించారని.. చిన్న వ్యాపారం చేస్తూ తమకు కష్టం తెలియకుండా పెంచారని పేర్కొంటున్నారు. అమ్మ ప్రేమకు దూరమయ్యామనే లోటును తెలియకుండా కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చారన్నా రు. ఆయన కఠోర శ్రమ తాము ఎదగడానికి దోహదపడిందన్నారు. కాగా మహేశ్వర్‌జీ మొదటి కుమార్తె సుప్రియ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్‌గా, రెండో కుమార్తె సుస్మిత పోస్టల్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తుండగా, కుమారుడు సందీప్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు.