
అగ్నివీర్ ఉద్యోగులకు ఘనసన్మానం
షాద్‌నగర్ రూరల్: అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన వారికి శనివారం యువ సైనిక్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రికి చెందిన వరుణ్‌కుమార్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన చల్మారెడ్డి, జహీరాబాద్ జిల్లాకు చెందిన సాగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన వేదాన్ష్, కల్వకుర్తికి చెందిన శేషికుమార్ పట్టణంలోని యువసైనిక్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అగ్నివీర్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించి ఉద్యోగాలను పొందారు. 2023 బ్యాచ్‌లో 7 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు పట్టణానికి వచ్చిన సందర్భంగా నేషనల్ అథ్లెట్‌కోచ్ గిరి ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ.. 2024 సంవత్సరం నోటిఫికేషన్ అగ్నివీర్ పరీక్షకు ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 20 నుంచి ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాచారం కోసం 9493434907, 9848947484 నంబర్‌లను సంప్రదించాలని పేర్కొన్నారు.