క్షణికావేశంలోవివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

Jun 13 2024 12:54 AM | Updated on Jun 13 2024 11:51 AM

-

మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాయపల్లికి చెందిన శ్వేత (26) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల ద్వారా తెలిసిన వివరాలు.. కుటుంబ సభ్యులందరూ కలిసి మంగళవారం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లివచ్చారు. 

కుటుంబ సమస్యల కారణంగా క్షణికావేశంలో వివాహిత తమ ఇంటికి అనుసరించుకొని ఉన్న పాత ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊరిపితో ఉన్న ఆమెను నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement