సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలి

Jul 30 2026 5:00 AM | Updated on Jul 30 2026 5:00 AM

కల్వకుర్తి రూరల్‌: ప్రపంచంలోని సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో కల్వకుర్తి పట్టణంలో 91 విశ్వశాంతి మహాయాగం కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఉద యం నుంచి రాత్రివరకు కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు మారుమోగుతున్నా యి. హోమాలు, యాగాలు సర్వ మానవాళి మేలుకోసమే జరుగుతున్నాయి. 11రోజులుగా యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులతోపా టు యాగ నిర్వాహకులు జూలూరు రమేష్‌బాబు కుటుంబ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్‌ బృంగి రత్న మాల ఆనంద్‌కుమార్‌ దంపతులతోపాటు ప్రముఖులు పాల్గొని చండీహోమం నిర్వహించారు. హో మానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులు యాగశాల ప్రదక్షిణ చేయడంతోపాటు హనుమాన్‌ చాలీసా పారాయణం, భక్తి పాటలు పాడడంతోపాటు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం చండీహో మం, పాశుపత, శ్రీ సుదర్శన, లక్ష్మీనారాయణ హో మాలు, సరస్వతి పూజలు, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వా మి కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. సామూహిక కుంకుమార్చనలో దంపతులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకష్ణ, బాలకృష్ణ, సురేందర్‌, రామస్వామి, ప్రకాష్‌, గోపాల్‌, సతీష్‌, రమకాంత్‌రెడ్డి, సంతుయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement