ఉరేసుకుని వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వలస కూలీ మృతి

Jul 30 2026 5:00 AM | Updated on Jul 30 2026 5:00 AM

గద్వాల క్రైం: జీవనోపాధి కోసం వచ్చిన ఓ వలస కూలీ ఉరేసుకుని మృతిచెందిన ఘటన గద్వాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్‌లోని ముజాఫార్‌పూర్‌కు చెందిన టూటాన్‌ రామ్‌ (34) నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వలస వచ్చాడు. అయితే బసాపురం శివారులోని అబ్దుల్‌ అజీమ్‌ కోళ్ల షెడ్డులో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తండ్రి, కుమారుడి ఆరోగ్యం క్షీణించింది. వారంరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇద్దరి ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. ఈ విషయంపై మనస్తాపం చెంది తెల్లవారుజామున కోళ్ల షెడ్డులో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి అక్క ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పాముకాటుకు బలి

నర్వ: పాముకాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన ఉందేకోడ్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పబ్బతి రమే ష్‌ కధనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3:30గంటల ప్రాంతంలో మొట్టె చిన్న న ర్సింహులు(48) తనకు ఏదో కరిచిందని కు టుంబ సభ్యులకు చెప్పాడు. భార్య, కొడుకు దుప్పటిని పరిశీలించి చూడగా.. నూనెకట్ల పా ముగా గుర్తించి చంపారు. అనంతరం 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ..ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లలిత, కుమారుడు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో

వివాహిత ఆత్మహత్య

ఉప్పునుంతల: మండలంలోని తాడూరుకు చెందిన గుండెమోని పార్వతమ్మ (43) గత ఆదివారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్‌ తెలిపారు.

ఇందిరమ్మ ఇంటికి క్యూరింగ్‌ చేస్తుండగా..

అయిజ: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. చిన్న తాండ్రపాడు గ్రామానికి చెంది న ఏసన్న (60) బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి పైకప్పుకు నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం వైర్లను తాకాడు. దీంతో అక్కడ నుంచి కింద ఉన్న రాళ్ల కుప్పపై పడిపోయాడు. అది గమనించిన కు టుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఏసన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడికి భార్య, కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

స్తంభం తలపై

పడి రైతు మృతి

మానవపాడు: పంటపొలంలో ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం తలపై పడి రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్‌కానిస్టేబుల్‌ శివకుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్‌ గొల్ల పెద్ద నారాయణ (51) పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో గెట్టు వద్ద ఉన్న స్తంభానికి బిగించిన స్టే వైర్‌ ట్రాక్టర్‌ పలుగుకి తగిలింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అలాగే ముందుకు పోవడంతో స్తంభం విరిగి గొర్రుపై ఉన్న గొల్ల పెద్దనారాయణ తలపై పడడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గుర్తిచించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పెద్ద నారాయణ మృతి చెందాడు. మృతుడికి కుమార్తె, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌కానిస్టేబుల్‌ శివకుమార్‌ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో

క్షుద్రపూజలు

గద్వాల క్రైం: జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవా రం అర్ధరాత్రి క్షు ద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని రాఘ వేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ముగ్గులు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు చూసి భయాందోళన చెందారు. స్థానిక కౌన్సిలర్‌ రామలింగేశ్వర కాంళ్లే స్థానికుల సహాయంతో శుభ్రం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement