
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డికి జిల్లా ప్రజలతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి పేరు సీఎం ఊరుగా మారిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. డైనమిక్ లీడర్ సీఎం అవుతున్నాడని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి రోజులు వచ్చాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. సొంత జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు.
– సాక్షి నెట్‌వర్క్