మద్యం దుకాణాల్లో విక్రయాలు షురూ.. | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల్లో విక్రయాలు షురూ..

Published Sun, Dec 3 2023 12:44 AM

కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం  
 - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: కొత్త ఎకై ్సజ్‌పాలసీ 2023–25కి సంబంధించి జిల్లాలో 67 మద్యం దుకాణాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలోని తిమ్మాజిపేట స్టాక్‌పాయింట్‌ నుంచి రూ.5 కోట్లకు పైగా ఐఎంఎల్‌ మద్యంతో పాటు బీర్లను దుకాణాదారులు కొనుగోలు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రెండురోజుల పాటు జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడినప్పటికీ శుక్రవారం నుంచి జిల్లాలోని దుకాణాల్లో విక్రయాలు మొదలు కావడంతో వారి సమస్య తీరింది. ఈ ఏడాది నిర్వహించిన మద్యం టెండర్లలో కొందరు కొత్త వ్యక్తులు ఉండగా, మరికొందరు పాత వ్యక్తులు షాపులు దక్కించున్నారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు మద్యం దుకాణాలు దక్కించుకున్నవారికి నిబంధనలు పాటించాలని, పర్మిట్‌ రూంలు ఏర్పా టు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది డిసె ంబర్‌1 నుంచి ప్రారంభమయ్యే మద్యం దుకాణా లు 2025 నవంబర్‌ 30వరకు కొనసాగనున్నాయి.

జిల్లాలో 67 దుకాణాలు

జిల్లాలో 67 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాగర్‌కర్నూల్‌ స్టేషన్‌పరిధిలో 18, కల్వకుర్తి స్టేషన్‌పరిధిలో 17, అచ్చంపేట స్టేషన్‌ పరిధిలో 13, కొల్లాపూర్‌ స్టేషన్‌ పరిధిలో 12, తెలకపల్లి స్టేషన్‌ పరిధిలో 7 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.

కొనుగోళ్ల వివరాలు

జిల్లాలోని మద్యం దుకాణాల్లో మొదటిరోజు రూ.5కోట్లకు పైగా ఐఎంఎల్‌ మద్యంతో పాటు బీర్లను కొనుగోలు చేసినట్లు ఎకై ్సజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో 5 ఎకై ్సజ్‌ స్టేషన్లు కొనసాగుతుండగా మొదటి రోజు అచ్చంపేట స్టేషన్‌ పరిధిలో 1,009 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 1,906 బీర్‌కేసులు, కల్వకుర్తి స్టేషన్‌ పరిధిలో 1,563 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 2,904 బీర్‌ కేసులు, కొల్లాపూర్‌ ఎకై ్సజ్‌స్టేషన్‌ పరిధిలో 1,080 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 1,583 బీర్‌ కేసులు, నాగర్‌కర్నూల్‌ స్టేషన్‌ పరిధిలో 1,666 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3,092 బీర్‌ కేసులు, తెలకపల్లి ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో 499 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 998 బీర్‌ కేసులు మద్యం దుకాణాదారులు కొనుగోలు చేశారు. మొదటి రోజు సగానికిపైగా స్టాక్‌ విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి రోజు రూ.5కోట్ల స్టాక్‌

కొనుగోలు

నిబంధనలు పాటించాలి

కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం దుకాణాదారులు నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు షాప్‌ను సీజ్‌ చేస్తాం.

– షేక్‌ ఫయాజుద్దీన్‌,

జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, నాగర్‌కర్నూల్‌

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement