
జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు
పాదయాత్రగా కర్ణాటక భక్తుడు
కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా నుంచి భక్తుడు ఆలుబాయ్ ఏడు రోజుల పాటు స్వామి వారి దీక్ష చేపట్టి కురుమూర్తి గుట్టకు పాదయాత్రగా వచ్చాడు. ఆదివారం ఉద్దాల ఉత్సవానికి కురుమూర్తి చేరుకున్నాడు. 8ఏళ్లుగా స్వామి వారి దీక్ష చేపట్టి దర్శనానికి కురుమూర్తి గిరులకు పాదయాత్రగా వస్తున్నట్లు ఆయర తెలిపారు.
చిన్నచింతకుంట: ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న మండలంలోని అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవం కార్తీక శుద్ధసప్తమి ఆదివారం భక్తిశ్రద్ధలతో ౖనిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. దాసంగాలు పెట్టి మొక్కులు చెల్లించారు. చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్‌లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తులు స్వామి వారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీపడ్డారు.
వడ్డేమాన్ ఉద్దాల మండపం నుంచి తరలింపు
మల్లమర్రి గ్రామంలో భక్తిశ్రద్ధలతో తయారు చేసిన చాటకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రాక్టర్‌పై వడ్డేమాన్ ఉద్దాల మండపానికి చేర్చారు. పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు మండపం వద్ద బారులు తీరారు. అప్పంపల్లి నెల్లి వంశస్తులు పాదుకలకు పూజలు చేసేందుకు మేళతాళాలతో మండపానికి చేరుకున్నారు.
ప్రముఖుల పూజలు..
పాదుకలకు ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆల వెంకటేశ్వరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పూజలు నిర్వహించారు.
భారీ బందోబస్తు మధ్య ఊరేగింపు
పోలీసుల భారీ బందోబస్తు మధ్య దళితులు ఉద్దాలను కురుమూర్తిగిరులకు తరలించారు. ఊకచెట్టువాగులో ఉద్దాలు చాటకింద భక్తులు దూరి పుణీతులయ్యారు. దీంతో రెండు గంటల పాటు ఊకచెట్టువాగులో తిరనాళ్లు జరిగాయి. ఊకచెట్టువాగు జనసంద్రంగా మారింది. శివసత్తుల ఆటపాటలతో గోవింద నామస్మరణ మార్మోగింది. అక్కడి నుంచి కాలిబాన తిర్మలాపూరం ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చారు. గ్రామస్తులు పూజలు నిర్వహించిన అనంతరం ట్రాక్టర్‌పై కురు మూర్తి గుట్టకు తీసుకువచ్చారు. దేవుని చెరు వు కట్టమీద ఉద్దా ల దర్శనం కోసం భక్తులు బారులు తీరా రు. జాతర మైదానంలోని ఉద్దాల గుండు వద్ద భ క్తులకు దర్శనం కల్పించి కాంచనగుహలో కురుమూర్తిస్వామి చెంతకు తీసుకెళ్లి మండపంలో ఉంచారు.
మంగళహారతులతో స్వాగతం పలికిన భక్తులు
జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం
గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు

స్వామివారికి గుమ్మడికాయ సమర్పించుకుంటున్న బాలుడు

కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్న భక్తులు
