అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ రోజున ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగితే వెంటనే స్పందించేలా అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి తెలిపారు. పండుగ రోజు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది సెలవులను సైతం రద్దు చేశామని పేర్కొన్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే 101 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.