వరల్డ్‌ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ

Jul 24 2023 1:04 AM | Updated on Jul 24 2023 8:06 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తుంది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్‌ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్‌ అకాడమీకి ఎంపికై శిక్షణ తీసుకుంటుంది. ఈమె తెలంగాణతో పాటు కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. తెలంగాణ నుంచి 2018 పంజాబ్‌లో జూనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.

2019లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జూనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రం తరపున గతేడాది ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రాపూర్‌లో 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌లో 24వ జాతీయస్థాయి యూత్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంది. కేరళలో సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ, మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్‌లో సీనియర్‌ లీగ్‌ (హరియంట్‌ చసాక్‌) వాలీబాల్‌ టోర్నీలో పాల్గొంది.

ఈ మూడు టోర్నీల్లో కేరళ జట్టు విన్నర్‌గా నిలిచింది. అస్సాం రాష్ట్రం గౌవహాటిలో ఈ ఏడాది ఫిబవరిలో 71వ ఉమెన్‌ సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిథ్యం వహించింది. సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో ఫెడరేషన్‌ కప్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది.

వరల్డ్‌ యూనివర్సిటీ పోటీలకు..

అనన్యశ్రీ తొలిసారిగా విదేశీగడ్డపై వాలీబాల్‌ పోటీల్లో పాల్గొననుంది. చైనా దేశం చెంగ్డ్‌ నగరంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీవరల్డ్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌శ్రీకు ఎంపికైంది. కేరళ యూనివర్సిటీ నుంచి చైనాకు వెళ్లే ఆలిండియా యూనివర్సిటీ వాలీబాల్‌ జట్టులో అనన్యశ్రీ చోటు దక్కించుకుంది. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్‌ క్యాంపులో పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement