మార్కెట్‌లోకి కొత్త మోడల్ వెర్నా విడుదల | Hyundai Verna 2023 launched in India | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్త మోడల్ వెర్నా విడుదల

Mar 25 2023 10:06 AM | Updated on Mar 25 2023 10:43 AM

కారును విడుదల చేస్తున్న సీఈఓలు    - Sakshi

హ్యుందాయ్‌ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి మరో కొత్త కారును విడుదల చేశారు.

పాలమూరు: హ్యుందాయ్‌ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి మరో కొత్త కారును విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ట్రెండ్‌ హ్యుందాయ్‌ షోరూంలో శుక్రవారం కొత్త మోడల్ వెర్నా కారును సంస్థ సీఈఓ గట్టు సిరిచందనరెడ్డి, మార్కెటింగ్‌ సీఈవో గట్టు హర్షిత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన తయారీలో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మధ్యస్థాయి సెడాన్‌ కొత్త వెర్నా ప్రవేశపెట్టిందన్నారు.

సరికొత్త హంగులతో విడుదలైన ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, 30రకాల భద్రత అంశాలు, 17రకాల లెవెల్‌–2 అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంన్స్‌ సిస్టమ్‌ ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌షోరూం ధర రూ.10.89లక్షలు నుంచి రూ.17.37లక్షల వరకు అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో సేల్స్‌ మేనేజర్‌ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్‌ మేనేజర్‌ వశీం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement