వేగంగా వీఓ భవన నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

వేగంగా వీఓ భవన నిర్మాణాలు

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

కురవి: జిల్లాలోని వివిధ గ్రామాల్లో వీఓ(గామైక్య సంఘాలు) భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 387 వీఓ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో చాలా వరకు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ భవనాలను మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, గ్రామస్థాయిలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. ఆర్థికలావాదేవీల రికార్డుల నిర్వహణ, పొదుపు డబ్బుల జమ, బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, వాయిదాల వసూళ్లు, సంఘాల ఖాతా పుస్తకాల రికార్డుల నిర్వహణ ఇక్కడి నుంచే జరుగుతుంది. శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతాయి.

ఒక్కో భవనానికి రూ.10లక్షలు

ఒక్కో వీఓ భవనానికి వీబీజీరామ్‌జీ పథకం నుంచి రూ.10లక్షలు కేటాయించారు. టాయ్‌లెట్స్‌కు రూ.1.25లక్షలు స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి కేటాయించారు. కాగా, జిల్లాలో 387 భవనాలు మంజూరు కాగా.. వీటిలో ఇప్పటి వరకు 59 భవనాలు పనులు ప్రారంభంకాలేదు. భూముల వివాదంలో 15 ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 40 భవనాలు పూర్తికాగా.. చివరి దశ నిర్మాణంలో 28 ఉన్నాయి. స్లాబ్‌ లెవల్‌లో 97, రూఫ్‌లెవల్‌లో 36, బేస్‌మెంట్‌ లెవల్‌లో 22, పునాదుల స్థాయిలో 20 భవనాలున్నాయి. 67 భవనాలకు భూమి పూజలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement