● తొర్రూరు ఆర్డీఓ గణేష్
నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ శివారు రామానుజాపురంలో ఇటీవల నిర్వహించిన భూ రీసర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా ఫిర్యాదు చేసుకుంటే రికార్డులను సరిచేసి అందిస్తామని తొర్రూరు ఆర్డీఓ గణేష్ రైతులకు సూచించారు. తహసీల్దార్ చంద నరేష్ ఆధ్వర్యంలో గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించి సర్వే వివరాలు వెల్లడించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో రైతులకు భూ రీసర్వే కొలతలకు సంబంధించిన నోటీసులను అందిస్తామన్నారు. అందులో రైతుల భూ కొలతలు ఉంటాయని, సక్రమంగా లేకుంటే సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఐ సురేందర్, ఆర్ఐ రామకృష్ణ, జీపీఓ మధుసూదన్, గ్రామ వార్డు సభ్యురాలు శీలం శ్రావణి, రైతులు పాల్గొన్నారు.
భవిష్యత్‌కు
బాటలు వేసుకోవాలి
గూడూరు: విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఉన్నత శ్రేణిలో రాణించి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని డీఐఈఓ విజయకుమారి అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల పరిసర ప్రాంతాలతో పాటు మౌలిక వసతులు పరిశీలించారు. ఉపాధ్యాయులకు బోధన విధానంపై పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమంతప్పకుండా కళాశాలకు హాజ రవ్వాలని, ప్రతీ ఒక్కరు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పరశురాములు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఇనుగుర్తి ఎంపీడీఓగా తోట హరీష్ బాధ్యతలు
ఇనుగుర్తి: మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ)గా తోట హరీష్ గురువారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ ఎంపీడీఓగా పనిచేసిన పార్థసారథి పెద్దవంగరకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కేసముద్రం ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న హరీష్‌కు జెడ్పీ సీఈఓ పురుషోత్తం ఎంపీడీఓగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ హరీష్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని తెలిపారు.
విద్యార్థినిపై కుక్కల దాడి.. తీవ్రగాయాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలో ఓ విద్యార్థినిపై కుక్కల దాడి చేయగా ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని చిత్రలహరి కేంద్రియ విద్యాలయం ప్రాంతంలోని తన ఇంటి నుంచి నందమూరినగర్ కాలనీలో ట్యూషన్ సెంటర్ వద్దకు వెళ్తున్న క్రమంలో కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. నందమూరి నగర్ కాలనీలో కుక్కలు స్వైరవిహా రం చేస్తున్నాయని, వాటి బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయస్థాయిలో ఆర్ట్స్ కాలేజీకి 23వ స్థానం
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయస్థాయి ఈడబ్ల్యూ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రభుత్వ కళాశాలల (అటానమస్) విభాగంలో 2026–2027 సంవత్సరానికిగాను 23వ స్థానం సాధించింది. ఓవరాల్ స్కోర్ 700లకుగాను 462 స్కోర్ సాధించి ప్రతిష్టాత్మకమైన కళాశాలగా గుర్తింపు పొందిందని ప్రిన్సి పాల్ జ్యోతి గురువారం తెలిపారు. ఈ కాలేజీ 2023లో 23వ స్థానం, 2024లో 23, 2025లో 25, మళ్లీ 2026–2027లో తిరిగి 23వ స్థానాన్ని దక్కించుకుంది. గురువారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి తదితరులు ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులను అభినందించారు.


