న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
బీమా పథకంతో కుటుంబానికి భరోసా
సాక్షి, మహబూబాబాద్: బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ముకు భద్రత కరువైంది. సెల్‌ఫోన్‌లో ఏమి నొక్కితే ఖాతా ఖాళీ అవుతుందో తెలియని పరిస్థితి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు కోల్పోయిన బాధితులు ఒక్కవైపు.. సైబర్ నేరాల ఫిర్యాదుల ఆధారంగా తమ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ఖాతాదారులు మరోవైపు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్ర హోంశాఖ కీలక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్)లో భాగంగా మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం), గ్రీవెన్స్ రీఅడ్రసెల్ మెకానిజం(జీఆర్‌ఎం)ను రూపొందించింది. 2026 ఏప్రిల్ నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో జూన్ 16న ప్రారంభించారు. ఈ పద్ధతితో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి గంటలోపు ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లా పోలీస్ అధికారులు తెలుపుతున్నారు.
డబ్బులు పోయిన వెంటనే..
డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల వద్ద నుంచి డబ్బుల రికవరీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు 1930 హెల్ప్‌లైన్‌కు లేదా జాతీయ సైబర్ క్రై మ్ రిపోర్టింగ్ పోర్టల్, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అప్పుడే 14 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. ఆ వివరాలు సంబంధిత పోలీసు విభాగానికి చేరిన తర్వాత, ప్రాధాన్యంగా సైబర్ ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తిస్తే సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ వ్యవస్థలోకి ఫిర్యాదును పంపిస్తారు. సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సమాచారం అందించి, మోసపోయిన సొమ్ము ఏయే ఖాతాలకు బదిలీ అయ్యిందో గుర్తించి, అందుబాటులో ఉన్న మొత్తాన్ని నిలిపివేసే చర్యలు చేపడుతారు.
సగటున నాలుగు ఫిర్యాదులు..
జిల్లాలో ఆర్థిక పరమైనవి, ఆర్థికేతర నేరాలతో సంబంధం ఉన్న సైబర్ నేరస్తుల బారిన పడిన వారి నుంచి ప్రతీరోజు సగటున నాలుగుకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 837 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఆర్థికపరమైన ఫిర్యాదులు 586 ఉండగా.. ఆర్థికేతర ఫిర్యాదులు 251 ఉన్నాయి. ఆర్థిక పరమైన నేరాల్లో రూ.3,54,07,407 డబ్బులు పొగొట్టుకున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో ఈ ఏడాది లోక్ అదాలత్ ద్వారా 96 మంది బాధితులకు రూ.37,00,057 తిరిగి అందించగా.. డైరెక్ట్ రీఫండ్ ద్వారా 7 ఫిర్యాదుల్లో రూ.31,64,244 తిరిగి అందించారు. ఇలా మొత్తం 103 ఫిర్యాదులకు సంబంధించి రూ.68,64,301 బాధితులకు తిరిగి అందించారు.
డబ్బులు పోగొట్టుకున్న వెంటనే స్పందించాలి. ఇందులోసం జిల్లాలో జిల్లా సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెల్ పనిచేస్తుంది. 1930కు ఫోన్ చేయాలి. ఎస్‌ఎంఎస్‌లోని అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను భద్రపరచుకోవాలి. బ్యాంకు స్టేట్‌మెంట్లు, యూపీఐ/ఆన్‌లైన్ లావాదేవీల రశీదులను భద్రపరచాలి. ఖాతా ఫ్రీజ్ అయితే బ్యాంకును సంప్రదించి జీఆర్‌ఎం ప్రక్రియ ద్వారా ఫిర్యాదు చేయాలి. రిఫండ్ పేరుతో డబ్బులు అడిగే మధ్యవర్తులను నమ్మకూడదు.
–శబరీష్, ఎస్పీ
ఉద్యోగులు కీలకంగా వ్యవహరించాలి
కలెక్టర్ స్నేహశబరీష్
వెంటనే స్పందిస్తే డబ్బుల రికవరీ
సైబర్ నేరాల బారిన పడిన వారికి ఊరట
పోగొట్టుకున్న సొమ్ము వెనక్కి తెచ్చేందుకు
ఎంఆర్‌ఎం రూపకల్పన
జీఆర్‌ఎంతో ఫ్రీజ్ ఖాతాల సమస్య పరిష్కారం
జిల్లాలో ప్రతీరోజు సగటున నాలుగు ఫిర్యాదులు
ఎంఆర్‌ఎం అమలుతో రూ.10లక్షల రికవరీ
సైబర్ నేరాల నియంత్రణ, పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేయడంలో తెలంగాణలో మానుకోట పోలీస్‌లు మంచి పేరు తెచ్చుకున్నారు. జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎం అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో 87,607 మంది బాధితులు ఉండగా.. 81,170 మంది బాధితులకు సంబంధించిన అభ్యర్థనలు పరిశీలించి రూ.58.25 కోట్లు రిఫండ్ చేశారు. అదేవిధంగా జీఆర్‌ఎం కింద మొత్తం 9,590 అభ్యర్థనలు రాగా.. 9,139 అభ్యర్థనలు పరిశీ లన పూర్తి చేశారు. ఇందులో మహబూబాబాద్ జిల్లాలో 118 ఫిర్యాదులు రాగా.. రీఫండింగ్ కోసం రూ.16,98,645ఉండగా.. బాధితులకు రూ.10,96,333 అందించి, 3,549 బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టిన మానుకోట పోలీస్‌లు రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్పీ శబరీష్, జిల్లా సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెల్ విభాగం అధికారులను డీజీపీ ీసీవీ ఆనంద్‌తోపాటు సైబర్ క్రైం విభాగం డీజీపీ షికాగోయల్ అభినందించారు.


