మానుకోట మార్కెట్ యార్డు పరిధిలో కొనుగోళ్ల విషయంలో ప్రతీరోజు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ధాన్యం, అపరాలు, మక్కలు, పత్తి విక్రయించేందుకు వచ్చే రైతులు పడిగాపులుపడక తప్పడంలేదు. సోమవారం రాత్రి 40 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకురాగా మంగళవారం సాయంత్రం వరకు బస్తాల్లోకి ఎత్తకుండా అలాగే ఉంచారు. జైశ్రీరామ్ రకం ధాన్యాన్ని విక్రయించగా క్వింటాకు సుమారు రూ.600కుపైగా ధర తగ్గించి కేవలం రూ.4,420కే కొనుగోలు చేశారు.
– గుగులోతు రాంసింగ్, లాలితండా, ముంగిమడుగు


