‘మూగ’రోదన ! | - | Sakshi
Sakshi News home page

‘మూగ’రోదన !

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

మహబూబాబాద్‌: జిల్లా పశుసంవర్థక శాఖలో చా లా మంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆశాఖ అధికారులు కూడా పట్టణాల నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ ఆలస్యంగా వస్తుండడంతో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో పశువైద్యశాలలో పాడి రైతులు వైద్యులు, సిబ్బంది కోసం పడిగాపులు కాస్తున్నారు. సిబ్బంది, మందుల కొరతతోనే రైతులు ఇబ్బందులు పడుతుంటే.. దీనికి తోడు సమయపాలన పాటించడం లేదు.

45 పశువైద్యశాలలు..

జిల్లాలో 3 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు (ప్రాంతీయ పశువైద్యశాలలు) 23 ప్రైమరీ సెంటర్లు, 19 సబ్‌ సెంటర్లు మొత్తం 45 పశు వైద్యశాలలు ఉన్నా యి. 2019లో చేపట్టిన పశుగణన ప్రకారం తెల్ల జాతి, నల్లజాతి, పశువులతో పాటు గొర్రెలు, మేకలు ఇతరత్రా అన్ని కలిపి 11,85,563 ఉన్నాయి. అయితే ఏడాది క్రితం చేసిన గణన ప్రకారం 8,40,114 మాత్రమే ఉన్నాయి. దీనిని బట్టి పశువుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెప్పొచ్చు.

కొన్ని పోస్టుల భర్తీ..

పశుసంవర్థకశాఖలో సిబ్బంది కొరత ఉండగా.. ఇటీవల బదిలీల్లో భాగంగా కొన్ని పోస్టులు భర్తీ చేశారు. ప్రధానంగా నాలుగు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు భర్తీ చేశారు. 15 వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులకు నాలుగు ఖాళీగా ఉన్నాయి. 38 అటెండర్‌ పోస్టులకు గానూ 10 ఖాళీగానే ఉన్నాయి. వాటితోపాటు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇటీవల బదిలీల్లో భాగంగా కొన్ని పోస్టులు భర్తీ చేయడంతో కాస్త ఊరట లభించింది. మందులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో పశువుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పశువైద్యశాల భవనంతో పాటు పలు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి నిర్మాణం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది.

సమయపాలన పాటించని సిబ్బంది..

శాఖ జిల్లాస్థాయి అధికారులే ఇతర పట్టణాల నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ ఆలస్యంగా వస్తున్నారు. దీంతో కార్యాలయం సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. వరంగల్‌, ఖమ్మం నుంచి రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.

● జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో ఏడీ (సహాయ సంచాలకులు), ఒక వెటర్నరీ అసిస్టెంట్‌(వీఏ) అవుట్‌ సోర్సింగ్‌లో అటెండర్‌ పని చేస్తున్నారు. అయితే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గత నెల 31న ఉదయం 10గంటల వరకు ముగ్గురిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. కనీసం అటెండర్‌ కూడా రాలేదు. దీంతో చేసేదేమీ లేక పాడిరైతులు ఇళ్లకు వెళ్లిపోయారు.

● ఈనెల 13న జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో ఉదయం 9గంటల వరకు కనీసం గేట్‌ తాళం కూడా తీయలేదు. 9.15 గంటలకు అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న అటెండర్‌ రాగా ఆతర్వాత వెటర్నరీ అసిస్టెంట్‌ ఎల్లయ్య వచ్చారు. ఏడీ మాత్రం 10గంటల వరకు రాలేదని రైతులు చెప్పారు. జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాల పరిస్థితి ఇలా ఉంటే మిగితా వాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సమయపాలన పాటించని

వెటర్నరీశాఖ సిబ్బంది

ఇతర ప్రాంతాల నుంచి

అప్‌ అండ్‌ డౌన్‌తోనే ఆలస్యం

పాడి రైతుల పడిగాపులు

మూగజీవాల వైద్యంలో నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement