ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, వీబీజీ రామ్‌జీ పథకం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్‌ చేయాలన్నారు. జిల్లాలో వీబీజీ రామ్‌జీ పనులు కల్పించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు. పైపులైన్‌ లీకేజీల వల్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement