జిల్లాలో ఏడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటన
● ఎండుతున్న పంటలు, తాగునీటికి పొంచి ఉన్న ముప్పు
● లోటు వర్షపాతంతో సతమతం
● అడుగంటిన భూగర్భజలాలు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవలేదు. లోటు వర్షపాతంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటల్లో సగం ఎండిపోతున్నాయి. చివరిదశకు వచ్చిన వరి పంటలు చేతికి అందే పరిస్థితి లేక రైతులు పాత బావుల పూడికతీత, కొత్త బోర్లు వేస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, కురవి, ఇనుగుర్తి, డోర్నకల్, సీరోలు, నెల్లికుదురు మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు. ఆయా మండలాల్లో నెలకొన్న కరువుపై గ్రౌండ్ రిపోర్టు. – సాక్షి, మహబూబాబాద్


