శాయంపేట : నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వ్యవసాయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రైతులు నర్సింహారెడ్డి, జయపాల్ రెడ్డి మాట్లాడుతూ పరకాలకు చెందిన ఓ ట్రేడర్స్ నిర్వాహకులు జోగంపల్లిలోని ఓడీఎంఎస్ ద్వారా మండలంలోని మైలారం, జోగంపల్లి, పెద్దకోడెపాక గ్రామాలకు చెందిన రైతులకు సిద్ధి రకం మంగల్ సీడ్ విత్తనాలు విక్రయించారన్నారు. విత్తనాలు నాటి 150 రోజులు గడిచినా ఇప్పటి వరకూ పంట గొలుసు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.


