దుగ్గొండి: నూతన వ్యవసా య పద్ధతులతో ఆదర్శంగా నిలిచిన అభ్యుదయ రైతు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గొల్లపల్లికి చెందిన తో ట మల్లికార్జున గుప్తా(70) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య వసంత, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా, మల్లికార్జున గుప్తా తనతో పాటు 10 మంది రైతులతో కలిసి గో ఆధారిత వ్యవసాయం ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు తన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే విధానంపై పలుమార్లు రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మూడుసార్లు రాష్ట్ర, జిల్లా ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. మల్లికార్జున గుప్తా అంతకుముందు నర్సంపేట ప్రాంతంలో తొలి పారిశ్రామిక వేత్తగా రైస్ మిల్లు ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించారు. కాగా, మల్లికార్జున గుప్తా మృతదేహం వద్ద పలువురు నివాళులర్పించారు.
అనారోగ్యంతో కన్నుమూత..
నివాళులర్పించిన పలువురు


