న్యూస్‌రీల్
పక్క ఫొటోలోని రైతు సీరోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఆవుదొడ్డి వెంకన్న. మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగు చేస్తున్నాడు. దోస, టమాట, చిక్కుడు, వంకాయ, బెండకాయ తదితర పంటలను సాగు చేస్తున్నాడు. పంటకు పెట్టుబడి సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టాడు. ఇప్పటి వరకు రూ.50 వేలు వచ్చాయి. వర్షాలు లేక వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. చేతికొచ్చిన పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బెండ తోట ఎండిపోతోంది. బావి పూడిక తీయించాలని ఉందని, అయితే ఈ ఎండలకు నీరు వస్తుందో రాదో అర్థం కావడం లేదని రైతు వెంకన్న వాపోయాడు.


