మార్కెట్‌లో ఇ–నామ్‌ సర్వర్‌ డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో ఇ–నామ్‌ సర్వర్‌ డౌన్‌

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

● ఆలస్యంగా విన్నర్‌జాబితా విడుదల

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఇ–నామ్‌ సర్వర్‌ డౌన్‌ కారణంగా బుధవారం విన్నర్‌జాబితా ఆలస్యంగా విడుదల చేశారు. రైతులు మార్కెట్‌కు తమ వ్యవసాయోత్పత్తులను అమ్మకానికి తీసుకువచ్చి, లాట్‌ ఐడీ నమోదు చేసుకుని రాశులుగా పోసుకున్నారు. సరుకులకు వ్యాపారులు టెండర్లు వేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇ–నామ్‌ సర్వర్‌ పనిచేయకపోవడంతో విన్నర్‌జాబితా విడుదల కాలేదు. దీంతో రైతులు ధరల కోసం పడిగాపులు పడ్డారు. కొందరు రైతులు మార్కెట్‌ కార్యాలయం వద్దకు చేరుకుని, తమ సరుకులకు రేట్లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించగా, అధికారులు సర్దిచెప్పారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల తర్వాత విడుదలైంది. దీంతో కొంత ఆలస్యంగా కాంటాలు, తొలకాలు జరపడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement