గూడూరు: విద్యాభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులకు సేవలందిస్తున్నామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సంస్థ అందించిన నిధులతో శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా 150 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ.. ఇప్పటికీ ఇంకా కొందరు పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారనే విషయం తెలుసుకొని సైకిళ్లు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో గెయిల్ సంస్థ ప్రతినిధులు వీర్ మురుగన్, కటియార్, అన్సారీ, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మి, ఎంఈఓ ఎ.సుజాత, తహసీల్దార్ నాగభవాని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాసమల్ల వెంకటేశ్వర్లు, మేరెడ్డి సురేందర్, గుగులోతు రాంబాబు, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రంలో..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రం జెడ్పీహైస్కూల్ ఆవరణలో శుక్రవారం గెయిల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సంస్థ సహకారంతో కేసముద్రంస్టేషన్, కేసముద్రంవిలేజ్, ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్‌లకు చెందిన 9,10వ తరగతి విద్యార్థినులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ చేతులమీదుగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గెయిల్ ఇండియా ఈడీ ఆర్‌ఎస్ వీర్‌మురుగన్, జీఎం కటియార్, ఆసిఫ్, అన్సారీ, సీజీఎం హెచ్‌ఆర్ శ్రీదేవ్‌కాంత్, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ప్రతినిధి లక్ష్మి, తహసీల్దార్ వివేక్, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, ఎంఈఓ కాలేరు యాదగిరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నర్సింహరెడ్డి, పట్టణ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్, భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


