కక్కుర్తి పడితే ఖతమే..! | - | Sakshi
Sakshi News home page

కక్కుర్తి పడితే ఖతమే..!

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

సాక్షి, వరంగల్‌: దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు మ్యూల్‌ ఖాతాల కేంద్రంగా జరుగుతుండడంతో ఈ ఖాతాదారులపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో 185 సైబర్‌ నేరాలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న ఖాతాలు వరంగల్‌లో ఉన్నట్టుగా ధ్రువీకరించిన కేసులో ఇప్పటికే వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌, మీల్స్‌ కాలనీ పోలీసులు అరెస్టు చేసిన 22 మంది సభ్యుల్లో ఏజెంట్లతోపాటు మ్యూల్‌ ఖాతాదారులుండడం కలవరానికి గురిచేస్తోంది. ముద్ర లోన్‌, ఇతర రుణాల కోసమంటూ డబ్బు అవసరమున్న విద్యార్థులు, రైతులు, కార్మికులను గుర్తించి బ్యాంక్‌ ఖాతా తెరిచి సంబంధిత పత్రాలు, ఏటీఎం కార్డు ఇస్తే కమిషన్‌ ఇస్తామంటూ నమ్మబలికి ఆ ఖాతాలను సైబర్‌ నేరాల కోసం వినియోగిస్తుండడం సంచలనం రేపుతోంది. దీంతో కమిషన్‌ కోసం కక్కుర్తి పడితే కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కమీషన్‌ కోసం ఇతరులకు మీ అకౌంట్‌ ఇచ్చి అది నేరానికి ఉపయోగించినట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.

‘మ్యూల్‌ ఖాతా’ అంటే..

మోసపూరితంగా వచ్చిన డబ్బును సైబర్‌ నేరగాళ్లు నేరుగా తమ ఖాతాల్లోకి తీసుకోకుండా, ఇతరుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తారు. ఇలాంటి ఖాతాలను ‘మ్యూల్‌ అకౌంట్‌’గా పిలుస్తారు. నేరాల ద్వారా వచ్చిన డబ్బు ఈ ఖాతాల్లోకి చేరిన తర్వాత పలు ఖాతాలకు బదిలీ చేయడం, నగదుగా మార్చడం లేదా ఇతర మార్గాల్లో తరలిస్తారు. ప్రస్తుతం నమోదైన కేసులో కూడా ఇలాంటి ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు అందించే ప్రత్యేక నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యవర్తి, ఏజెంట్లుగా వ్యవహరించేవారికి ఖాతాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తే అసలు ఖాతాదారుడికి రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఇస్తున్నట్లు సమాచారం.

సైబర్‌ ముఠాల మూడంచెల వ్యూహం..

ఎర: కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ముద్ర రుణం’ కింద రూ.50,000 ఇప్పిస్తామంటూ నకిలీ పత్రాలతో నమ్మిస్తారు.

కమీషన్‌: బ్యాంక్‌లో మీతోనే అకౌంట్‌ ఓపెన్‌ చేయించి.. పాస్‌బుక్‌, ఏటీఎం, సిమ్‌ కార్డు తీసుకుని రూ.6,000 నుంచి రూ.8,000 చేతిలో పెడతారు.

నేరం: ఆ అకౌంట్లను (మ్యూల్‌ ఖాతాలు) దేశవ్యాప్తంగా జరిగే కోట్ల రూపాయల ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు, నల్లధనాన్ని మళ్లించడానికి వాడుకుంటారు.

ఆశపడి బ్యాంక్‌ ఖాతాలిస్తే నేరమే..

కేసులు, ఆపై జైలుకు తప్పదంటున్న పోలీసులు

తాజాగా వరంగల్‌ పోలీసులు

ఛేదించిన కేసు చెబుతున్నదిదే..

మ్యూల్‌ ఖాతాదారులైతే మూల్యం చెల్లించాల్సిందే..

ఏం చేయకూడదు?

1.రూ.50 వేల లోన్‌ ఆశ చూపే లోకల్‌ బ్రోకర్లు, అధికారిక బ్యాంకులనే ఆశ్రయించాలి.

2. కమీషన్‌ వస్తుందని ఆశపడి బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఏటీఎం కార్డు, పిన్‌ ఇతరులకు ఇవ్వొద్దు.

3.మీ పేరు మీద తీసుకున్న సిమ్‌ అయిందని అనుమానం వస్తే వెంటనే ఇవ్వొద్దు.

4.నా అకౌంట్‌తో నేనేం మోసం చేయలేదు

కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు.

ఏం చేయాలి?

1. రుణాల కోసం నేరుగా గుర్తింపు పొందిన

మధ్యవర్తులను నమ్మొద్దు.

2.మీ ఆధార్‌, పాన్‌ కార్డులను దేనికై నా ఇస్తే,వాటిపై ఏ అవసరం కోసం ఇస్తున్నారో పెన్నుతో రాయాలి.

3.మీ ప్రమేయం లేకుండా అకౌంట్‌ ఓపెన్‌ కార్డును ఇతరులకు వాడుకోమని హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లి చెక్‌ చేయాలి.

4.సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement