వర్ధన్నపేట: మెడిసిన్‌లో సీటు వచ్చినా.. ఫీజు చెల్లంచే స్థోమత లేక ఆందోళనలో ఉన్న వర్ధన్నపేటకు చెందిన పేద విద్యార్థి అఖిలకు ‘ఆపన్న హస్తం అందించరూ..’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. విద్యార్థిని చదువుకు తమవంతు సాయం అందించడంలో భాగంగా.. నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖలో ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జ సుమన్‌రావు రూ. లక్ష, పట్టణంలోని వీరభధ్ర ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం రూ.25 వేలు, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రూ.35 వేలు, టీపీసీసీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, ఆరోగ్య శాఖ అధికారి నెహ్రునాయక్, రాజమణి దంపతులు రూ.10 వేల చొప్పున అందించారు. వీరితోపాటు మరికొంతమంది తమకు తోచిన సాయం అందించారు. దీంతో తన చదువుకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన దాతలకు, తన విషయంపై కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు అఖిల కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆపన్న హస్తం అందించిన దాతలు
సాక్షి, దాతలకు కృతజ్ఞతలు
తెలిపిన మెడికల్ విద్యార్థిని


