ఎస్‌జీఎఫ్‌ ఎంపిక పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

హాజరైన 800 మంది క్రీడాకారులు

వరంగల్‌ స్పోర్ట్స్‌: 70వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్‌– 14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ శుక్రవారం నిర్వహించారు. అండర్‌–14, 17 విభా గాల్లో షూటింగ్‌, స్కేటింగ్‌, హ్యాండ్‌ బాల్‌, గట్క, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బాక్సింగ్‌లో ఎంపికలు నిర్వహించారు. అండర్‌–19 కేటగిరీలో హ్యాండ్‌బాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నీస్‌, బేస్‌బాల్‌, గట్క, షూటింగ్‌లో ఎంపికలు నిర్వహించారు. ఇంటర్‌ ఆర్‌జేడీ గోపాల్‌, డీఐఈఓ శ్రీధర్‌ పోటీలను ప్రారంభించారు. 800 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌, ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తెలియజేశారు. ప్రభాకర్‌రెడ్డి, పార్థసారథి, బరుపాటి గోపి, కోట సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement