కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవ న నిర్మాణ సముదాయం, మౌలిక వసతులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తదితర పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణా లు పాటించకపోతే చర్యలు తీసుకోవా లని సూ చించారు. ముఖ్యంగా పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి, ఆస్పతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆ దేశించారు. సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, డి ప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ రాజకుమార్, ఎ న్పీడీసీఎల్ ఎస్‌ఈ ఆనందం, ఆర్ అండ్ బీ ఈఈ రాజేందర్, ఆర్డీఓ సుమ, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ సర్వాణన్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంజీఎం ఆర్‌ఎంఓ డాక్టర్ అశ్విని పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్
పోటీలకు జిల్లా జట్టు
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 19 నుంచి 21వ తేదీ వర కు నిజామాబాద్ జిల్లా కర్నపెల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు శుక్రవారం బయల్దేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రాజేందర్, సాంబమూర్తి, సుమలత, కోచ్ వినయ్ కుమార్, పీడీలు రాజు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : మతిస్థిమితం లేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టౌన్ ఎస్సై అంజమ్మ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని నారాయణ నగర్ కాలనీకి చెందిన జంగం సైదమ్మ కుమార్తె కీర్తి (29)ని పట్టణంలోని గుమ్మడూరు ప్రాంతానికి చెందిన కందుకూరి క్రాంతికుమార్‌కు ఇచ్చి 2018 మే 22వ తేదీన వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగపిల్లలు సంతానం. ఈక్రమంలో నాలుగు నెలల నుంచి కీర్తి ఎవరో పిలుస్తున్నారని, ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది.. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉండేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల నుంచి కీర్తి మందులు వేసుకోవడం మానేసింది.. ఆమె తల్లి సైదమ్మ, భర్త క్రాంతికుమార్ మందులు వాడాలని చెప్పినా వినలేదు. క్రాంతికుమార్ శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలలో దింపేందుకు వెళ్లాడు. అదేసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కీర్త ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తేల్చారు. తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
పనుల పరిశీలన


