కేయూలో న్యూపీజీ హాస్టల్‌ వద్ద ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

కేయూలో న్యూపీజీ హాస్టల్‌ వద్ద ఘర్షణ

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ హాస్టల్‌ మెస్‌ వద్ద గురువారం రాత్రి తాగునీటిని వినియోగించుకునే సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివా దం పరస్పర వాగ్వాదాల నుంచి చేయిచేసుకునేవరకు వెళ్లింది. ఇందులో ఓ విద్యార్థి సమాచారంతో అక్కడకు వచ్చిన నాన్‌బోర్డర్‌తోపాటు పలువురు మరో విద్యార్థిని కొట్టారని సమాచారం. విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సి టీ పోలీసులు చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పేయత్నం చేశా రు. విద్యార్థిపై చేయిచేసుకున్న నాన్‌బోర్డర్‌పై ఓ విద్యార్థి చేయి చేసుకున్నాడని తెలిసింది. అయితే నాన్‌బోర్డర్‌ వచ్చి క్యాంపస్‌ విద్యార్థిని కొట్టడంపై కొందరు విద్యార్థులు శుక్రవారం కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నాన్‌బోర్డర్ల సమస్యను పరిష్కరించి హాస్టల్‌ మెస్‌కు రాకుండా చూడాలని రిజిస్ట్రార్‌ను కోరారు. దీంతో వివాదానికి గల కారణాలపై రిజిస్ట్రార్‌ ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ రవికుమార్‌, ఎస్సై విజయ్‌ నాన్‌బోర్డర్లపై నిర్ణయం తీసుకుంటే తాము సహకరిస్తామని రిజిస్ట్రార్‌కు చెప్పారు.

ఈవిషయంపై కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రంను సాక్షి వివరణ కోరగా ఇద్దరు విద్యార్థుల మధ్య మెస్‌ వద్ద వివాదం తలెత్తిందని తెలిపారు. నాన్‌బోర్డర్ల రాకతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందన్నారు. పోలీసులు విచారణ జరిపి ఎవరిది తప్పనేది తేల్చి చర్యలు తీసుకుంటారని తనవద్దకు వచ్చినవారికి చెప్పినట్లు వివరించారు. కేయూ పోలీస్టేషన్‌ ఎస్సై విజయ్‌ను వివరణ కోరగా న్యూ పీజీ హాస్టల్‌ మెస్‌ వద్ద విద్యార్థుల మధ్య జరిగిన గొడవ సద్దుమణిగేలా చేశామని తెలిపారు. అయితే విద్యార్థులెవరూ పోలీస్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

మెస్‌వద్ద ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వైరం

పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం

పరస్పర ఆరోపణలతో రిజిస్ట్రార్‌ దృష్టికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement