కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

కాజీపేట రూరల్‌: కాజీపేట మీదుగా వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఆపరేషన్‌ కారణాల వల్ల ఈ నెల 20వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు

సికింద్రాబాద్‌–వరంగల్‌ (67761) పుష్‌పుల్‌, వరంగల్‌–సికింద్రాబాద్‌ (67762) పుష్‌పుల్‌, సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757) ఎక్స్‌ప్రెస్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (12758) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.

వరంగల్‌ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు

వరంగల్‌ మీదుగా ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కోసం 8 సర్వీస్‌లుగా ప్రయాగ్‌రాజ్‌–తిరుణెలివెళ్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా..

ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు 4 సర్వీస్‌లుగా ప్రయాగ్‌రాజ్‌–తిరుణెలివెళ్లి (04171) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు 4 సర్వీస్‌లుగా తిరుణెలివెళ్లి–ప్రయాగ్‌రాజ్‌ (04172) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్‌కు చేరుకొని వెళ్తాయి. ఈ రైళ్లకు అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో మాణిక్‌పూర్‌, సంత, కట్నీ, జబల్‌పూర్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, బల్లార్షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్‌పాడి, జోలర్‌పెట్టాయ్‌, సేలేమ్‌, నమక్కల్‌, కౌసర్‌, దిండిగల్‌, మధురై, విరుదునగర్‌, సతర్‌, కోవిల్‌పట్టిలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు.

వరంగల్‌ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement