కోర్టు ప్రారంభోత్సవం సజావుగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రారంభోత్సవం సజావుగా జరగాలి

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

తొర్రూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి

ధీరజ్‌ కుమార్‌

మరిపెడ రూరల్‌: మరిపెడలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జూనియల్‌ సివిల్‌ కోర్టు ప్రారంభోత్సం సజావుగా జరిగేలా చూడాలని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి ధీరజ్‌ కుమార్‌ సూచించారు. మరిపెడ పట్టణంలో రేపు(శనివారం) నిర్వహించనున్న జూనియర్‌ సివిల్‌ కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ కృష్ణవేణి, సీఐ పవన్‌ కుమార్‌, ఎస్సై గండ్రాతి సతీష్‌, ఏజీపీ లింగాల శ్రీనివాస్‌, సీనియర్‌ అడ్వకేట్‌ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు బానోతు లాలు, తొనుకునూరి సైతులు, తేజావత్‌ శారదరవీందర్‌ నాయక్‌, శ్రీశైలం, శ్రీనివాస్‌, మామిడాల మునేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement