జనగామ రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి మతవిద్వేషాలు, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలు సహించబోరని, తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటం స్ఫూర్తిని ఎవరూ చెరిపివేయలేరని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జనగామలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదని భూస్వామ్య దోపిడీ వెట్టిచాకిరీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సామాన్యులు సాగించిన మహత్తర ప్రజాపోరాటమన్నారు. అంతకుముందు ప్రిస్టియన్ గ్రౌండ్ నుంచి కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.డి అబ్బాస్, నాయకులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమయ్య, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, పుప్పాల శ్రీకాంత్, జోగు ప్రకాశ్, బూడిద గోపి, సుంచు విజేందర్, మునిగల రమేశ్, ఉపేందర్, బోడ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం


