జనగామ : ఖాసీం రజ్వీకి పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గోబెల్స్ మాదిరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్‌కు ఏ గతి పట్టిందో మంత్రికి కూడా అదే గతి పడుతుందన్నారు. భూ కబ్జాలపై మంత్రి పొంగులేటి.. తనపై చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. తన భూములను 22ఏ జాబితాలో చేర్చడంపై చట్టపరంగా పోరాడుతానన్నారు. రేవంత్, పొంగులేటి భూ దందాలపై ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, నాయకులు, ప్రజా ప్రతినిధులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పసుల ఏబేలు, గద్దల నర్సింగరావు, వెన్నెల రామకృష్ణ, రెహమాన్, పెద్దిరాజిరెడ్డి, ఉడుగుల కిష్టయ్య, సేవెల్లి మధు, అనిత, రేఖ, ఉల్లెంగుల సందీప్, రవి, అనిల్, సువార్త, మంజుల, పల్లవి, ముక్కెర కరుణకర్‌రెడ్డి, కొమ్ము రాజు, సిద్ధులు, అల్వాల ఎల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, దావెర రాజు, మామిడాల రాజు తదితరులు ఉన్నారు.
రేవంత్, పొంగులేటి భూ దందాలపై ప్రజాగ్రహం తప్పదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


