హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట పటిమకు ప్రజాపాలన దినోత్సవం సజీవ సాక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీ స్వాతంత్య్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. నిజాం పాలన, ఫ్యూడల్ వ్యవస్థ, రజాకార్ల అరాచకాల మధ్య తెలంగాణ ప్రజలు తలవంచకుండా తమ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. 1930, 1940 దశకాల్లో కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల నాయకత్వంలో సాగిన ఉద్యమాలు తెలంగాణ విముక్తి పోరాటానికి పునాది వేశాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా కొనసాగిందన్నారు. ప్రజల సుదీర్ఘ పోరాటంతో అప్పటి కేంద్ర హోం మంత్రి వల్లబాయి పటేల్ నాయకత్వంలో జరిగిన సైనిక ఆపరేషన్‌తో నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో భాగమైందన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, అన్నపూర్ణ, వెంకటరమణ, గౌతమ్ రెడ్డి, మల్లికార్జున్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు రమేశ్, శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కేయూలో ప్రజాపాలన దినోత్సవం..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్‌డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, ఎం. సుదర్శన్, చిర్ర రాజు, ప్రిన్సిపాళ్లు టి. మనోహర్, నర్సింహాచారి, ఎస్. నర్సింహాచారి, అవెన్యూ ప్లాంటేషన్ ఇన్‌చార్జ్ బి. వెంకటగోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


